సోనూ.. దిల్ సోనా: అజయ్ దేవ్‌గన్

by Shyam |
సోనూ.. దిల్ సోనా: అజయ్ దేవ్‌గన్
X

కరోనా మహమ్మారి ప్రపంచానికి కొందరు నిజమైన హీరోలను పరిచయం చేసింది. అందులో ఒకరు సోనూసూద్. ముంబైలో చిక్కుకున్న వలస కార్మికులను స్వస్థలాలకు పంపించేందుకు అతడు చేపట్టిన చర్యలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. వలస కూలీలను వారి సొంతూళ్లకు పంపించేందుకు కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, కేరళ, బీహార్ రాష్ట్రాలకు బస్ సౌకర్యం కల్పించిన సోనూ.. వేలాది మంది కార్మికులకు హీరో అయ్యాడు. ఇప్పటికీ ముంబైలో ఎవరైనా కూలీలు చిక్కుకుపోతే వారిని సొంత గడ్డకు చేర్చేందుకు.. హెల్ప్‌లైన్ నంబర్ లాంచ్ చేశాడు. 18001213711కు కాల్ చేసి మీ వివరాలు అందిస్తే మా టీమ్ మిమ్మల్ని సురక్షితంగా ఇంటికి చేర్చుతుందని భరోసా ఇచ్చాడు.

కాగా, సోనూ చేస్తోన్న గొప్ప పనికి బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గన్ ఫిదా అయ్యాడు. కరోనా మహమ్మారి వ్యాప్తి నడుమ మైగ్రెంట్ వర్కర్స్‌ను ఇంటికి చేర్చేందుకు పగలు, రాత్రి కష్టపడుతున్న సోనూసూద్‌పై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు. తన మంచి మనసుకు మరింత ప్రేమ, బలం చేకూరాలని కోరుకున్నాడు.

అంతేకాదు మానవత్వం ఉన్న మనిషిగా కార్మికులను ఇళ్లకు చేర్చేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్న సోనూకు.. ఇండస్ట్రీ మొత్తం అభినందనలు తెలుపుతోంది. తోటి నటీనటులు ఆయనను హీరోగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నీ సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని కలిగిస్తాయని ప్రశంసిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed