‘RRR’ షూటింగ్‌లో అజయ్ దేవగన్?

by Shyam |   ( Updated:2020-11-21 06:34:42.0  )
‘RRR’ షూటింగ్‌లో అజయ్ దేవగన్?
X

దిశ, వెబ్‌డెస్క్ : జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. తారక్ కొమురం భీమ్‌గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ చిత్రంలో వీరిద్దరికీ గురువుగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కనిపించనున్నారనే విషయం తెలిసిందే. భగత్ సింగ్‌గా వారిలో ఉద్యమ జ్వాలను రగిలించే పవర్‌ఫుల్ పాత్రను అజయ్ ఇందులో చేయబోతున్నారు. కాగా శుక్రవారం ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ నిమిత్తం ఆయన హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారని తెలుస్తోంది.

లాక్‌డౌన్‌కు ముందు దాదాపు పది రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్న అజయ్ దేవగన్.. ఈ షెడ్యూల్‌లో తన పోర్షన్ కంప్లీట్ చేస్తారని టాక్. మరోవైపు ‘అజయ్ భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ మూవీ షూటింగ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతోందని, అందుకోసమే వచ్చాడని కొందరు చెప్తుంటే.. తన డైరెక్షన్‌లో వస్తున్న నెక్స్ట్ ఫిల్మ్ షూటింగ్ స్పాట్స్ ఫైనల్ చేసేందుకు వచ్చి ఉంటాడని మరో టాక్. ‘మే డే’ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.

Advertisement

Next Story