- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన బౌలర్‌కు నో చాన్స్
దిశ, స్పోర్ట్స్: ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసిన బౌలర్‌కు తర్వాతి మ్యాచ్‌లో చోటు గల్లంతు అవుతుందని ఎవరైనా ఊహిస్తారా? కానీ కివీస్ సెలెక్టర్లు అదే చేసి చూపించారు. ముంబై వాంఖడేలో ఇండియాతో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 10 మంది భారత బ్యాటర్లను పెవీలియన్ పంపి అజాజ్ పటేల్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అనిల్ కుంబ్లే, జిమ్మీ లేకర్ తర్వాత ఆ ఫీట్ సాధించిన మూడో బౌలర్.. పైగా విదేశీ గడ్డపై ఈ ఫీట్ చేసి చూపించిన ఏకైక బౌలర్‌గా రికార్డులకు ఎక్కాడు.
అయితే తాజాగా బంగ్లాదేశ్ పర్యటనకు అజాజ్‌కు మెండిచేయి చూపించారు. న్యూజీలాండ్ ప్రకటించిన తాజా జట్టులో అతడి చోటు గల్లంతుఅయ్యింది. దీంతో సోషల్ మీడియాలో అజాజ్‌పై సానుభూతి పెరిగిపోతున్నది. అంతే కాకుండా న్యూజీలాండ్ సెలెక్టర్లపై విమర్శలు పెరిగిపోయాయి. దీనిపై కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్ వివరణ ఇచ్చారు. చారిత్రాత్మక ప్రదర్శన చేసిన అనంతరం అజాజ్ జట్టుకు దూరమవడం బాధకరమైన విషయమే. అయితే స్వదేశంలో జరుగనున్న సిరీస్‌లో మ్యాచ్‌ల పిచ్‌లను దృష్టిలో పెట్టుకునే ఈ ఎంపిక జరిగింది అని గ్యారీ స్టీడ్ అన్నాడు. గ్రీన్ వికెట్లపై స్పిన్నర్ల కంటే పేసర్లకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. అందుకే అజాజ్‌ను పక్కన పెట్టినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే అజాజ్ తిరిగి జట్టులోకి వస్తాడని గ్యారీ చెప్పుకొచ్చాడు.