- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Aishwarya Sakhuja: సోనూ సూద్ను బాధపెట్టనందుకు సంతోషపడుతున్నా : నటి
దిశ, సినిమా: యాక్ట్రెస్ ఐశ్వర్యా సఖుజా మైనర్ సర్జరీ కోసం గత వారం హాస్పిటల్‌లో చేరింది. సోషల్ మీడియాలో చేతికి సెలైన్ డ్రిప్ ఉన్న పిక్ పోస్ట్ చేసి ఈ విషయాన్ని తెలిపిన ఆమె.. నాన్ కొవిడ్ రిలేటెడ్ ఇష్యూతో హాస్పిటల్‌లో జాయిన్ అయినట్లు తెలిపింది. మన బాడీ మెషిన్ లాంటిది. దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మనదే అని తెలిపింది. తాను జాయిన్ అయిన ఆస్పత్రిలో కొవిడ్ ట్రీట్మెంట్ లేదు కాబట్టి సేఫ్‌గా ఫీల్ అయినట్లు తెలిపింది. కొవిడ్ సిచ్యుయేషన్ తనలో చాలా మార్పు తీసుకొచ్చిందని, లైఫ్ ఇంపార్టెన్స్ చెప్పిందని వివరించింది. అంతకు ముందు తాను హైపోకాన్డ్రియాక్(రోగ భ్రమస్తుడు)తో బాధపడేదానినని, కానీ కరోనా తనను పూర్తిగా మార్చేసిందని చెప్పింది. తనకు, తన కుటుంబానికి కరోనా పాజిటివ్ రానందుకు సంతోషంగా ఉందన్న ఆమె.. సోను సూద్‌ను ఆక్సిజన్ అరేంజ్ చేయమని బాధపెట్టనందుకు ఆనందంగా ఉందని చెప్పింది.