Aishwarya Rai Bachchan : నీలి కళ్లే.. నన్ను నిలబెట్టాయి

by Shyam |   ( Updated:2024-02-03 13:36:52.0  )
aishwarya-rai
X

దిశ, సినిమా: సమ్మోహన రూపం, మైమరిపించే నటనతో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. 1994లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుని ప్రపంచమంతా తనవైపు తిరిగిచూసేలా చేసిన ఐశ్వర్య.. ఆ తర్వాత అనేక బాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే మోడలింగ్ డేస్ తొలినాళ్ల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యేవరకు తన జర్నీ అంత సాఫీగా సాగలేదని వెల్లడించింది. ఈ సందర్భంగా మోడలింగ్‌లో తన మొదటి అవకాశం ఎలా వచ్చిందో తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. ‘మా కాలేజ్ ప్రొఫెసర్ ఒక మ్యాగజైన్‌కు ఫొటో జర్నలిస్ట్‌గా పనిచేస్తుండేవారు. ఓసారి ఏదో ఫ్యాషన్ ఫీచర్‌కు సంబంధించి అసైన్‌మెంట్ గడువు దగ్గరపడటంతో నన్ను చేయమని రిక్వెస్ట్ చేస్తే పూర్తి చేశాను. అదే నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్’ అని చెప్పుకొచ్చింది. ఇక మిస్ వరల్డ్ టైటిల్ గెలిచాక తన లైఫ్ పూర్తిగా మారిపోయిందని చెప్పింది. యంగ్ ఏజ్‌లో తన నీలి కళ్లు, హెయిర్ కలర్ అందరిలో ప్రత్యేకంగా నిలబెట్టాయని పేర్కొంది.


Advertisement
Next Story

Most Viewed