నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో ఐశ్వర్యా రాయ్

by Shyam |
నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో ఐశ్వర్యా రాయ్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ గార్జియస్ ఐశ్వర్యా రాయ్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతుంది. లాక్‌డౌన్‌లో పలు స్క్రిప్ట్‌లు విన్న ఐశ్వర్య.. నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్‌ ఓకే చేసినట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే చర్చలు ప్రారంభం కాగా.. త్వరలోనే షూటింగ్ స్టార్టయ్యే అవకాశం ఉందని బీటౌన్ వర్గాల టాక్. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్న ఐశ్వర్య.. ఈ క్రమంలోనే డిజిటల్ డెబ్యూట్‌కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే భర్త అభిషేక్ బచ్చన్ ‘బ్రీత్ 2’ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేయగా, ఇప్పుడు ఐశ్వర్య కూడా ఆ లిస్ట్‌లో చేరబోతోంది. కాగా సైఫ్ అలీ ఖాన్, అనిల్ కపూర్, షాహిద్ కపూర్, శ్రద్ధ కపూర్ లాంటి ఏ లిస్ట్ స్టార్స్ కూడా వెబ్ సిరీస్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. కంటెంట్ ఉన్న ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కావడంతో ఐశ్వర్య కూడా నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్‌కు ఓకే చెప్పిందని టాక్.

Advertisement

Next Story