గ్లోబల్ ట్యాక్స్ లీకేజీ కేసులో ఐశ్వర్యా రాయ్‌.. ఈడీ విచారణకు హాజరు

by Shyam |   ( Updated:2021-12-20 04:02:23.0  )
Aishwarya Rai
X

దిశ, సినిమా: మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌ ఈడీ విచారణకు హాజరైంది. 2016 ‘పనామా పేపర్స్’ గ్లోబల్ ట్యాక్స్ లీకేజీకి సంబంధించిన కేసులో ఢిల్లీలోని లోక్‌నాయక్‌ భవన్‌లో విచారణకు అటెండ్ అయినట్లు తెలుస్తోంది. ఆర్‌బిఐకి చెందిన లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద 2004 నుంచి ఇప్పటి వరకు విదేశీ చెల్లింపులపై వివరణ ఇవ్వాలని కోరుతూ బచ్చన్ కుటుంబానికి నోటీసులు జారీ చేశారు అధికారులు. ఈ విషయం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారగా.. ఈ కేసులో ఇండియా నుంచి సుమారు 500 మందికి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, బిజినెస్ మ్యాన్‌లు ఉన్నారని ఈడీ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed