ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌‌తో జతకట్టిన మాస్టర్ కార్డ్!

by  |
ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌‌తో జతకట్టిన మాస్టర్ కార్డ్!
X

దిశ, సెంట్రల్ డెస్క్: రైతులకు, చిన్న మధ్య తరహా సంస్థల(ఎస్ఎమ్ఈ)కు రుణ సౌకర్యాలు, ఇతర బ్యాంకింగ్ సర్వీలను అందించే లక్ష్యంతో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు తాజాగా మాస్టర్‌కార్డ్‌తో జతకట్టింది. బ్యాంకింగ్ సర్వీసులు అందుబాటులో లేని వినియోగదారులకు ఈ సేవలు అందించడానికి, డిజిటల్ వినియోగాన్ని పెంచడానికి తమ భాగస్వామ్యం పనిచేస్తుందని ఇరు సంస్థలు అభిప్రాయపడ్డాయి. రైతులకు అధునాతన వ్యవసాయాన్ని గురించి చెప్పడం, వారిని మార్కెట్‌తో అనుసంధానం చేయడం, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లోకి నేరుగా పెమెంట్స్ పొందడం వంటి వాటికోసం ఖచ్చితమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఇవ్వడానికే ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వివరించింది.
ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకుకు సుమారు 4 కోట్ల మంది వినియోగదారులున్నారు. అంతేకాకుండా, దేశంలో 5 లక్షల బ్యాంకింగ్ పాయింట్‌లను కలిగి ఉంది. రైతులకు మార్కెట్ విస్తరణను పరిచయం చేయడం, కొత్త పరిష్కారాలను సూచించడం, వారి అకౌంట్‌లలోకి నేరుగా నగదు అందుకోవడం, నగదు రిస్క్‌ల నుంచి రక్షణ పొందడం, రుణ లభ్యత ఉంటుందని భావిస్తున్నట్టు మాస్టర్ కార్డ్ దక్షిణాసియా డివిజన్ ప్రెసిడెంట్ పోరుస్ సింగ్ చెప్పారు. వినియోగదారులకు, వ్యాపారులకు ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్‌సీ) ద్వారా డిజిటెల్ చెల్లింపుల సర్వీసులను అందించడానికి ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, మాస్టర్ కార్డ్ సంస్థలు సంయుక్తంగా పనిచేయనున్నాయి. రెండు కంపెనీలు పలు రకాల సేవలందించడానికి గత మూడేళ్లుగా కలిసి పనిచేస్తున్నాయి.


Next Story