మళ్లీ జియోను అధిగమించిన ఎయిర్‌టెల్!

by Shamantha N |
మళ్లీ జియోను అధిగమించిన ఎయిర్‌టెల్!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ అధిక కొత్త వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్స్‌తో వరుసగా మూడో నెల జియోను అధిగమించింది. అక్టోబర్ నెలకు సంబంధించి ఎయిర్‌టెల్ మొత్తం 37 లక్షల కొత్త యూజర్లను దక్కించుకోగా, జియో 22 లక్షల కొత్త యూజర్లతో సరిపెట్టింది. టెలికాం రెగ్యుల్టరీ ట్రాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం..జియోతో పోలిస్తే ఎయిర్‌టెల్ 14.5 లక్షల ఎక్కువ సబ్‌స్క్రైబర్లను దక్కించుకుంది.

అలాగే, ఎయిర్‌టెల్ తన నెట్‌వర్క్‌లో 96.74 శాతం యాక్టివ్ యూజర్ బేస్్‌ని కలిగి ఉంది. జియో యాక్టివ్ యూజర్ బేస్ 78.59 శాతం ఉండగా, వొడాఫోన్ ఐడియా 88.78 శాతం, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 61.38 శాతం యాక్టివ్ యూజర్లను కలిగి ఉన్నాయి. అయితే, అక్టోబర్‌లో వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ కమ్యూనికేషన్, ఎంటీఎన్ఎల్ కంపెనీలు కొత్త మొబైల్ కస్టమర్లను పొందడంలో విఫలమయ్యాయి. వీటిలో వొడాఫోన్ ఐడియా 27 లక్షల సబ్‌స్క్రైబర్‌లను కోల్పోవడం గమనార్హం. ట్రాయ్ వివరాల ప్రకారం..జియో ప్రస్తుతం 40.6 కోట్ల కస్టమర్లను కలిగి ఉండగా, ఎయిర్‌టెల్ 33.02 కోట్ల మంది కస్టమర్లను, వొడాఫోన్ ఐడియా 29.2 కోట్ల కస్టమర్లను కలిగి ఉంది. అక్టోబర్ చివరి నాటికి దేశంలో మొత్తం టెలికాం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 117.18 కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్‌లో ఇది 116.86 కోట్లుగా నమోదైంది.

Advertisement

Next Story

Most Viewed