న్యూ ఫ్యాషన్.. ఎయిర్‌పాడ్ ఇయర్‌రింగ్స్

దిశ, వెబ్‌డెస్క్: అవసరం అన్నింటినీ నేర్పిస్తుందంటే ఏంటో అనుకున్నాం గానీ, కరోనా వచ్చిన తర్వాత వస్తున్న కొత్త కొత్త ఇన్వెన్షన్లు చూస్తే నిజమే అనిపిస్తోంది. మొన్నటికీ మొన్న ముట్టుకోకుండా షాపింగ్ చేయగలిగే అగుమెంటెడ్ రియాలిటీ అద్దం, నిన్నేమో మాస్కులతో మ్యూజిక్ ఎన్‌హాన్సర్.. ఇలా అవసరానికి తగినట్లుగా రోజుకొక కొత్త వస్తువు పుట్టుకొస్తోంది. ఈ క్రమంలోనే ఓ చక్కని అలంకరణ వస్తువు మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఇంతకీ ఆ వస్తువు ఏంటంటే ఎయిర్‌పాడ్ ఇయర్‌రింగ్స్. అంటే ఎయిర్‌పాడ్ ఆకారంలో ఇయర్‌రింగ్స్ కాదండోయ్.. ఎయిర్‌పాడ్స్‌ను పట్టి ఉంచడానికి పనికొచ్చే ఇయర్‌రింగ్స్. వాటి కథేంటో ఓ లుక్కేయండి..

మిశో డిజైన్స్ క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేసే సుహానీ పరేఖ్.. కొవిడ్ 19 కారణంగా ఇంటి నుంచి పనిచేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో భాగంగా ఆమె ఫోన్లు మాట్లాడటంతోా పాటు వీడియో కాల్స్, జూమ్ మీటింగ్‌లకు అటెండ్ కావాల్సి వస్తోంది. వీటన్నింటికీ చెవిలో ఎయిర్‌పాడ్స్ తప్పనిసరి. కానీ అవి ఎప్పుడు ఎక్కడ కిందపడతాయోనని ఆమెకు అనిపించేదట. కానీ వాటి మార్కెటింగ్ స్టాటిస్టిక్స్ చూసి ఆమె షాక్ అయ్యింది. యాపిల్ సంస్థ 2019లో ఏకంగా 60 మిలియన్ జతల ఎయిర్‌పాడ్స్ అమ్మిందని, వాటి అమ్మకాలు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదని ఆమె గ్రహించింది. అంటే.. తను పడుతున్న ఇబ్బందే చాలా మంది ఆడవాళ్లు పడుతుండవచ్చని అనుకుంది. అందుకే ఆ యాపిల్ ఎయిర్‌పాడ్స్‌ను పట్టి ఉంచే చెవిపోగులను డిజైన్ చేసింది. పెద్దగా కావాలనుకున్న వాళ్లకు పెద్దగా, చిన్నగా కావాలనుకున్నవాళ్లకు చిన్నగా, డిజైన్ కావాలనుకున్న వాళ్లకు డిజైన్‌తో ఆమె ఎయిర్‌పాడ్ ఇయర్‌రింగ్స్‌ను డిజైన్ చేసింది.

Advertisement