- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యానశాఖలో ఖాళీలు భర్తీ చేయాలి
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో చాలా ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న ఉద్యాన అధికారి, విస్తరణ అధికారి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతున్నా ప్రభుత్వం మాటలకే పరిమితం అయ్యిందని విమర్శించారు. దాదాపు 20లక్షల ఎకరాల్లో పువ్వులు, పండ్లు, కూరగాయాలు పండించే రైతులకు సరైన అవగాహన లేక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈశాఖలో కేవలం 140మంది అధికారులు మాత్రమే ఉన్నారని, కిందిస్థాయిలో పనిచేసే విస్తరణ అధికారులు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది 60మంది ఉద్యాన డిప్లొమా, 200మంది ఉద్యాన డిగ్రీ పూర్తి చేసుకుంటున్నారని ప్రస్తుతం 5వేల మంది నిరుద్యోగులుగా ఉన్నారని పేర్కొన్నారు.
Advertisement
Next Story