కేంద్ర, రాష్ట్రాల ధోరణి మారాలి: సంపత్​కుమార్​

by Shyam |
కేంద్ర, రాష్ట్రాల ధోరణి మారాలి: సంపత్​కుమార్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులను మోసగించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని, ఆ ధోరణి వెంటనే మార్చుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు మంగళవారం రాజ్‌భవన్ ముట్టడిస్తామని ఆయన తెలిపారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డగోలుగా పెరుగుతున్నాయని, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గుతుంటే భారత్‌లో ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్వయం పాలనలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది నాయకులు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం వందల కోట్ల మంది ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని, రైతు సంఘాలు 50 రోజులుగా ఢిల్లీలో దీక్షలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలకు ఎందుకు చట్టబద్ధత ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాజ్‌భవన్​ముట్టడికి ప్రజలు, రైతులు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Next Story