- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేతుల్ని చూసి చెప్పేస్తారు!
దిశ, వెబ్‌డెస్క్ :
చేతుల్ని చూసి జాతకం చెప్పే వాళ్లని శాస్త్రవేత్తలు నమ్మరు. కానీ వాళ్లే ఇక నుంచి చేతుల్ని చూసి నేరం చేయబోయే వ్యక్తులను గుర్తిస్తామని ప్రకటించారు. లాంకస్టర్ యూనివర్సిటీ, డండీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వారు ప్రస్తుతం చేస్తున్న ప్రయోగం గురించి వివరించారు. ఇందులో చేతుల ఫొటోలను విశ్లేషించి, వాటిని ఇప్పటికే నేరం చేసిన వారి చేతులతో పోల్చి, భవిష్యత్తులో తప్పు చేయబోయే వారిని పసిగట్టే అల్గారిథంను వారు రూపొందిస్తున్నారు.
ఈ ప్రాజెక్టుకు హెచ్ యనీక్ అని పేరు పెట్టారు. వేలి ముద్రలలాగే చేతులు కూడా ప్రతి మనిషికి ప్రత్యేకంగా ఉంటాయనే సిద్ధాంతం ఆధారంగా వారు ఈ ప్రోగ్రామ్‌ని నిర్మిస్తున్నారు. ఈ అల్గారిథం ద్వారా పిల్లలను లైంగికంగా వేధించాలనుకునే బుద్ధి ఉన్నవాళ్లని సులభంగా కనిపెట్టవచ్చని పరిశోధకులు అంటున్నారు. కానీ ఇది జరగాలంటే ముందు వారికి చేతుల ఫొటోలతో కూడా పెద్ద డేటాబేస్ కావాలి. ఈ డేటాబేస్ ద్వారా వారు కంప్యూటర్‌ని ట్రెయిన్ చేసి అల్గారిథం రూపొందిస్తారు.
సాయం కావాలి
చేతుల ఫొటోల డేటాబేస్ తయారు చేయడానికి అందరి సాయం కావాలని పరిశోధకులు అడుగుతున్నారు. 18 ఏళ్లు దాటిన వాళ్లందరూ తమ స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా చేతుల ఫొటోలను పంపించాలని కోరుతున్నారు. ఈ ఫొటోలతో డేటాబేస్ రూపొందించి అల్గారిథం డిజైన్ చేయనున్నారు. ఇందుకోసం వారికి 5000కి పైగా చేతుల ఫొటోలు కావాలి. ఫొటోలు పంపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వారు మాటిచ్చారు. ప్రాజెక్టు పూర్తవగానే ఫొటోలను డిలీట్ చేస్తామని కూడా చెప్పారు. ఈ ప్రాజెక్టుకి ఫోరెన్సిక్ ఆంత్రోపాలజిస్ట్ ప్రొఫెసర్ డేమ్ సూ బ్లాక్ సారథ్యం వహిస్తున్నారు.