- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదరికం స్థాయి అంచనా కోసం ‘కృత్రిమ మేధస్సు’
ఆఫ్రికాలోని అనేక గ్రామాల్లో కాలంతో పాటు పేదరికంలో వచ్చిన మార్పులను అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు కృత్రిమ మేధస్సు సాయం తీసుకుంటున్నారు. శాటిలైట్ చిత్రాలను ఈఏఐ టూల్ ద్వారా స్కాన్ చేసి పేదరికంలో చోటుచేసుకున్న మార్పులను గుర్తించనున్నారు. చిత్రాల్లో ఉన్న రోడ్లు, వ్యవసాయం, ఇండ్లు, రాత్రి వెలిగిన లైట్ల సమాచారాన్ని ఈఏఐ టూల్ స్కాన్ చేసి ఆయా ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని అంచనా వేస్తుంది. డీప్ లెర్నింగ్ ఆల్గారిథం సాయంతో గ్రామస్తుల్లో నమూనాలను డిజైన్ చేయనున్నారు.
స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఇప్పటికే ఆఫ్రికా ఖండంలోని 23 దేశాల్లో దాదాపు 20,000 గ్రామాల మీద ఈ టూల్ ప్రయోగం చేశారు. ఆ గ్రామాలకు సంబంధించి అందుబాటులో ఉన్న ఆర్థిక డేటాను, టూల్ ఉత్పత్తి చేసిన డేటాతో పోల్చి చూశారు. ఫలితాలు అనుకున్నదాని కంటే మెరుగ్గా రావడంతో మిగతా దేశాల మీద కూడా ప్రయత్నించబోతున్నట్లు ప్రొఫెసర్ డేవిడ్ లోబెల్ తెలిపారు. ఈ నమూనాలను గుర్తించడం ద్వారా ఒకే రకమైన సామాజిక పథకాలు అమలు చేసినప్పటికీ అభివృద్ధిలో తారతమ్యాలు ఎందుకు వస్తున్నాయనే విషయాన్ని పరిశోధించబోతున్నారు. వీటి ఆధారంగా అభివృద్ధికి పెద్దగా నోచుకుని గ్రామాలకు అనుగుణంగా సామాజిక పథకాలు రూపొందించే అవకాశం కలుగుతుందని డేవిడ్ చెప్పారు. జనాభా లెక్కల ద్వారా, డోర్ టు డోర్ సామాజిక సర్వే ద్వారా పేదరికాన్ని అంచనా వేసినా ప్రయత్నం లేకపోవడంతో ఇలా టెక్నాలజీ సాయం తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆయన సూచిస్తున్నారు.