- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Mango farming: మామిడి పూత దశలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. లేదంటే నష్టం తప్పదు..!

దిశ, వెబ్ డెస్క్ : పండ్లలో మామిడిని ( Mango ) రాజుగా చెబుతుంటారు. దేశంలో మామిడి పండ్లను అధికంగా పండిస్తారు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రైతులు మామిడి తోటలను సాగు చేస్తున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 6 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇంకా పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో మామిడిని పండిస్తున్నారు.
మామిడి (Mango ) పూత మూడు దశల్లో కనిపిస్తుంది. పచ్చ పూత, తెల్ల పూత, నల్ల పూతగా ఉంటుంది. ప్రస్తుతం, పచ్చ పూత నుంచి తెల్ల పూతకు మారే సీజన్ ఇది. ఏప్రిల్ కల్లా ఇది నల్ల పూతగా మారి మామిడి కాయలు వస్తాయి. ఈ దశలో ఉన్నప్పుడు పురుగు కూడా పడుతుంది. అది దిగుబడి మీద కచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. తెల్ల పూతలో ఉన్నప్పుడు ఎలాంటి కొట్టకూడదు. ఎందుకంటే, ఆ సమయంలోనే మామిడి పిందెలు పడతాయి. ఒక వేళ తప్పనిసరిగా ముందులు పిచికారి చేయాలనుకుంటే.. మార్కెట్లో దొరికే ఏదైనా ఒకటి మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా పంటను చాలా వరకు కాపాడుకోవచ్చు.
నల్లపూత దశలో పిందె కట్టు మొదలవుతుంది. ఈ సమయంలో పూత రాలిపోతుందని మందులను కొట్టడం వలన ఏలాంటి ప్రయోజనం ఉండదు. ఈ దశలో ఒక నీటి తడి వేస్తే సరిపోతుంది. అదేవిధంగా రాతిమంగు, మసిమంగు ఉన్న వాటికీ పవర్ఫుల్ స్ప్రే చేస్తే కాయ బరువు కూడా పెరుగుతుంది. మామిడి పంటలో పిందె, పూత రాలిపోవడం అనేది ప్రధాన సమస్య. ఒక్కోసారి జొన్న గింజంత సైజు లోనే పిందెలు మొత్తం రాలిపోతుంటాయి. దీనికి గల ముఖ్య కారణం నీటి తడుల్లో వ్యత్యాసం లేకుండా చూసుకోవాలి. ఎర్ర రేగడైతే 10 రోజులకు, నల్ల రేగడైతే 20 రోజులకు క్రమంగా నీరును ఇవ్వాలి. అదే సమయంలో యూరియా వేయడం వలన కాయలు పెరిగిగా అధిక దిగుబడి వస్తుంది.