Red Lemon: ఎర్ర నిమ్మకాయ గురించి ఎప్పుడైనా విన్నారా.. దీని ధరెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

by Prasanna |
Red Lemon: ఎర్ర నిమ్మకాయ గురించి ఎప్పుడైనా విన్నారా.. దీని ధరెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?
X

దిశ, వెబ్ డెస్క్: మనం ఇప్పటికి వరకు పసుపు రంగు, పచ్చ రంగు నిమ్మకాయలను చూసాము. ఇవి మాత్రమే కాకుండా ఎర్ర నిమ్మ కూడా ఉందని మనలో చాలా మందికి తెలియదు. ఈ అరుదైన చెట్టు పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా పర్దమాన్ జిల్లాలో ఉంది. దీనిని చాలా మంది వాడుతుంటారు. దానికి తగ్గట్టుగానే మార్కెట్‌లో దీనికి డిమాండ్‌ కూడా అలాగే ఉంది. అయితే, ఈ నర్సరీలో లభించే ఈ అరుదైన నిమ్మచెట్టు ఇతర దేశానికి సంబందించినది. ఇది చూడటానికి చిన్న పండు అయినప్పటికీ ఎక్కువ జ్యూస్ కలిగి ఉంటుంది.

ఈ నిమ్మచెట్టు ఏడాదికి ఆరు నెలలు వరుసగా పండ్లను ఇస్తుందని చెబుతున్నారు. ఇది సాధారణ చెట్టు కంటే ఎక్కువ దిగుబడి వస్తుందని అక్కడి వాళ్లు చెబుతున్నారు. దీనిని పెంచడానికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు. మొక్క కూడా ఎండిపోదు. అయితే, ఈ నిమ్మ చెట్లను మెరక ప్రదేశాల్లో నాటితే మంచిది. అప్పుడే చెట్టు కింద నీరు నిల్వ ఉండదు.

ఈ ఎర్రని నిమ్మ కేజీ ధర వేలల్లో పలుకుతోంది. ఇక మొక్క ధర రూ. 150 గా ఉంది. కానీ, మార్కెట్‌లోకి రాలేదు. ఈ నిమ్మ పండును విడిగా కొనాలంటే ఎక్కువ ఉంటుందని నర్సరీ వాళ్ళు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఈ ఎర్రని నిమ్మకాయలను పండించే రైతులు అధిక లాభాలను పొందుతారు.

Advertisement

Next Story

Most Viewed