Farmer: రైతులకు గుడ్ న్యూస్.. మీ పొలానికి కంచె వేసుకోవడానికి ప్రభుత్వమే డబ్బు చెల్లిస్తుంది.. కావాల్సిన పత్రాలు ఇవే..!

by Prasanna |
Farmer: రైతులకు గుడ్ న్యూస్.. మీ పొలానికి కంచె వేసుకోవడానికి ప్రభుత్వమే డబ్బు చెల్లిస్తుంది.. కావాల్సిన పత్రాలు ఇవే..!
X

దిశ, వెబ్ డెస్క్ : రైతులు విత్తనం వేసిన దగ్గర నుంచి మొక్క ఎదిగి పంటకు వచ్చే వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. లేదంటే కోతులు, గేదెలు, పక్షులు కారణంగా పంటలు పాడయ్యే అవకాశం ఉంది. ఎవరు లేని సమయంలో పొలాల్లో అదే పనిగా తిరుగుతుంటాయి. అయితే, రైతులు ఈ సమయంలో పంటను కాపాడుకోవడానికి కంచెను వేస్తుంటారు. అయితే, ప్రభుత్వం రైతుల కోసం కొత్త పథకాన్ని ముందుకు తీసుకొచ్చింది.

తారాబంది పథకం ద్వారా.. రైతులు తమ పొలాలు చుట్టూ ఫెన్సింగ్‌ను ఏర్పాటు కోసం గ్రాంట్స్ ను పొందవచ్చు. ఈ పథకం ద్వారా ఫెన్సింగ్ సొంతగా వేసుకోవడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో దానిలో 90 శాతం వరకు సబ్సిడీ వస్తుంది. ఒక వేళ, రైతులకు ఫెన్సింగ్ ఖర్చు రూ.20,000 అయితే.. రూ.18 వేలు తిరిగి వస్తుంది. అప్పుడు రైతులు రూ.2 వేలు మాత్రమే చెల్లిస్తే చాలు.

దీనికి కావాల్సిన పత్రాలు.. బ్యాంక్ పాస్ బుక్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ కార్డు, ఫెన్సింగ్ వైర్ కోసం చెల్లించిన డబ్బు రిసిప్ట్ తో మీరు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యవసాయం చేసే ఏ రైతు అయినా ఈ పథకానికి అర్హులు. ప్రస్తుతం, ఈ స్కీమ్ రాజస్థాన్ లో అమల్లో ఉంది.

Advertisement

Next Story

Most Viewed