- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Agriculture: వేసిన పంటలకు దిగుబడి రావాలంటే.. రైతన్నలు వీటిని పాటిస్తే చాలు
దిశ, వెబ్ డెస్క్: రైతులు ఒక పంట వేసి దానిని పండించడానికి కొన్ని నెలలు కష్ట పడతారు.. అయినా ఒక్కోసారి దిగుబడి రాదు అలాంటి సమయంలో రైతులకు ఏం చేయాలో కూడా అర్ధం కాదుగమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.
నాణ్యమైన విత్తనం
రైతులు ముందుగా విత్తనం నాణ్యమైనదో.. కాదో తెలుసుకుని విత్తనాలు పెట్టాలి. కొందరు నకిలీ విత్తనాలు వేసి పంటలు పండలేదని నిరాశ చెందుతారు.. కాబట్టి విత్తనం నాటే ముందు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. రెండేళ్ల కొకసారైనా విత్తనాన్ని మారుస్తూ ఉండాలి లేదంటే దిగుబడి తగ్గిపోతుంది. విత్తన మార్పిడి పద్ధతి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
భూమి బలం
కొందరు రైతులు భూమి బలాన్ని చూసి పంటను వేస్తారు.. బలహీనంగా అనిపిస్తే పశువుల ఎరువు, గొర్రెల ఎరువులు ఏడాదికొకసారి పొలాల్లో వేసుకుంటూ ఉండాలి. దీని వలన పంట దిగుబడి వస్తుంది. కొందరు వాటి స్థానంలో జనుము, జీలుగలు వేసి సాగు చేసాక పంటను వేస్తుంటారు. దీని వలన భూమికి బలం పెరుగుతుంది. అలాగే, రసాయనాలను కూడా ఎంత వరకు ఉపయోగం ఉంటుందో అంత వరకు మాత్రమే వాడాలి లేదంటే దిగుబడి తగ్గుతుంది. నాణ్యత లేని ఎరువుల వాడకం భూమి మీద సానుకూల ప్రభావాన్ని చూపుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.