- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Business : మొక్కలతో బిజినెస్.. లక్షల్లో ఆదాయం.. ఐడియా సూపర్!
దిశ, వెబ్ డెస్క్: ఈ రోజుల్లో సొంతగా వ్యాపారాలు చేసుకునే వారు ఎక్కువయ్యారు.. ఎందుకంటే పెట్టుబడులు పెట్టిన ప్రయోజనం ఉండటం లేదని ఇలా ఎవరి వారు ఉన్న డబ్బుతో చిన్న బిజినెస్ లు స్టార్ట్ చేస్తున్నారు. మొదట్లో నష్టాలు వచ్చిన రెండు, మూడు ఏళ్ళకు సెట్ ఐపోతున్నారు. అయితే, ఇప్పుడు చెప్పబోయే యువకుడు కథ కూడా అలాంటిదే.. నర్సరీ బిజినెస్ తో ఏడాదికి రూ. 10 లక్షలు సంపాదిస్తున్నాడు.
కదిరికి చెందిన ఓ యువకుడు నర్సరీల అవుట్ డోర్, ఇండోర్ మొక్కలను పెంచుతూ డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. మనం వేసే పొలాలు, తోటలు బాగా పండాలంటే.. భూమిలో నాటే మొక్క చాలా ముఖ్యం లేదంటే నష్టాలు వస్తాయి. పంట దిగుబడి రావాలంటే .. అది నారు మొక్కలపైన దృష్టి పెట్టాలి. పంట వేసాక సమస్యలు వస్తే మొత్తానికే ఏమి కాకుండా పోతుంది. కాబట్టి, క్వాలిటీ ఉన్న మొక్కలనే ఎంచుకోవాలి. అయితే, ఇతను ఇదే పాయింట్ తీసుకుని రైతులకు నాణ్యత ఉన్న మొక్కలను సరఫరా చేస్తున్నాడు.
అతని నర్సరీలో మొత్తం 25 నుంచి 30 రకాల పూలు, పండ్ల మొక్కలు పెంచుతున్నాడు. జాస్మిన్, నందివర్ధన, నూరువరాలు, సన్నజాజి, సంపంగి,అగ్లోనియం, హ్యాంగింగపాట్స్, విరాజాజీ, రోజా, క్రిపర్స్, రెడీలిఫ్టిక్, మినీ దానిమ్మ, హైబిస్కస్, లిల్లి, అమరలిల్లి, ఇన్సులిన్, మినిజమా, గులాబీ మొక్కలు అమ్మకాలు చేస్తున్నామని తెలిపాడు. రూ.4 లక్షలతో తన వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన నేడు ఏడాదికి రూ. లక్షలు సంపాదిస్తున్నాడు.