- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒకవైపు కరోనా మరోవైపు అకాల వర్సాలు ఆంధ్రప్రదేశ్‌ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. వ్యవసాయదారులను అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గాలివానల బీభత్సంతో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్లిపోతోంది.
వేసవి సీజన్‌లో కొన్ని చోట్ల వరి రెండో పంట కోతకి వస్తోంది. ఈ దశలో వరుణుడు ఆగ్రహించినట్టు ప్రతి రోజూ కొన్ని జిల్లాల్లో కురుస్తూ రైతులకు కన్నీళ్లు మిగులుస్తున్నాడు. కరోనా కారణంగా పనులు లేక తీవ్ర ఇంబ్బందులు పడుతున్న వ్యవసాయదారులకు పంట చేతికి వచ్చినా ఇంటికి తెచ్చే మార్గం లేక తల్లడిల్లేలా చేస్తున్నాడు. దీంతో పంటచేలు కొయ్యాలా? లేక అలాగే వదిలెయ్యాలా? అన్నది నిర్ణయించుకోలేకపోతున్నారు. ధాన్యం నానిపోతే వాటిని కొనే నాధుడుండడు. రంగుమారిందని, బాలేదని సవాలక్ష కారణాలతో ఆ ధాన్యాన్ని తిరస్కరిస్తారని రైతు వాపోతున్నాడు.
మరోవైపు ఈ సీజన్‌ను ఏపీ రైతులు జీడి, మామిడి సీజన్‌గా పేర్కొంటారు. అలాంటి సీజన్‌లో అకాల వర్షాలు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఒకవైపు మామిడి చెట్లకున్న పూత, పిందె భారీ గాలులు, వడగళ్ల వానలకు రాలిపోతున్నాయి. మరోవైపు పూత దశలో ఉన్న జీడి తోటలపై ఈ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో బాగా సాగయ్యే జీడితోటలపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సాయంత్రం వర్షం కురిస్తే తెల్లారేసరికి పొగమంచు కురుస్తోంది. ఈ రెండు కూడా జీడి, మామిడి పంటలకు శత్రువులన్న సంగతి తెలిసిందే. పరపరాగ సంపర్కం జరగాలంటే వివిధ రకాల జీవులు వాటిపై సంచరించాల్సి ఉంటుంది. పొగ మంచుకారణంగా ఇతర జీవులు వాటిమీదకు వచ్చే అవకాశం లేదు.
ఒకవేళ ఒకటి రెండు చోట్ల ఆ జీవులు వచ్చినా.. ముందు రోజు కురిసిన తడికి అతుక్కుపోయే ప్రమాదం ఉంది. దీంతో చెట్లనిండా పూత కనిపించినా దాని వల్ల ఎలాంటి దిగుబడి రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉభయగోదావరి, గుంటూరు, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో అరటి తోటలు, మొక్కజొన్న తోటలు నేలకొరిగాయి. యార్డులలో ఆరబెట్టిన మిరప పంటలు తడిసిపోయాయి. కొబ్బరి చెట్లు కూలిపోయాయి. ప్రకాశం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లాలో పిడుగు పాటుకు ఏడుగురు మృత్యువాత పడ్డడం కలచివేసింది. మరోచోట పిడుగు పాటుకు రెండున్నర ఎకరాల పశుగ్రాసం దగ్ధమైంది.
Tags: agriculture, sudden rains, mango, corn paddy, rice paddys, banana, cashew