- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం..
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర రైతుల కళ్ళలో నేడు ఆనందం చూస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి సాగునీటి వనరులను ఒడిసిపట్టే ప్రయత్నం చేయడమే దీనికి కారణమని చెప్పారు. గురువారం వనపర్తి జిల్లా మధనపురం మండలం శంకరంపేట గ్రామ సమీపంలోని సరళా సాగర్ ప్రాజెక్టు పున:నిర్మాణ పనులు పూర్తైన సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించి జలపూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అపర భగీరధుడు సీఎం కేసీఆర్ ఆదేశానుసారం అనుకున్న సమయానికి సరళాసాగర్ ఆయకట్టు రైతులకు సాగునీరు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో గతేడాది కంటే ఈ ఏడాది పదిలక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. నిన్నటి వరకు వచ్చిన సమాచారం మేరకు రికార్డు స్థాయిలో కొటి ముప్పై లక్షల ఎకరాల్లో సాగు చేయబడిందని, ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.