- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలి త్రైమాసికం నాటికి బాటా వృద్ధి : సందీప్ కటారియా
దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాది(2021) జూన్ త్రైమాసికం ముగిసే సమయానికి తమ కంపెనీ తిరిగి వృద్ధి సాధిస్తుందనే నమ్మక ముందని ఫుట్‌వేర్ దిగ్గజం బాటా ఇండియా సీఈవో సందీప్ కటారియా తెలిపారు. ‘గత కొంతకాలంగా తాము ప్రతివారం మెరుగైన అమ్మకాలను సాధిస్తున్నాం. నెమ్మదిగా స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తామనే ఆశలున్నాయి. ఇప్పటికే విక్రయాలు కరోనాకు ముందునాటి స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా స్కూళ్లు మూసివేయడం వల్ల స్కూల్ షూస్ విభాగం ప్రభావితమైంది. మొత్తంగా చూసుకుంటే గతేడాది అమ్మకాల్లో 70-80 శాతం తిరిగి సాధించామని సందీప్ వెల్లడించారు. ఇటీవల సందీప్ కటారియా బాటా గ్లోబల్ సీఈవోగా బాధ్యతలను తీసుకుంటున్న నేపథ్యంలో.. కరోనా మహమ్మారి వల్ల చాలా విలువైన అనుభవం తోడైందని తెలిపారు.
అత్యంత చురుగ్గా, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం అలవడిందని సందీప్ పేర్కొన్నారు. ఇటీవల బాటా సరికొత్త కార్యక్రమాలను చేపట్టింది. గో-టు-మార్కెట్ కార్యక్రమంలో భాగంగా స్టోర్-ఆన్-వీల్స్,బాటా క్లబ్ సభ్యుల కోసం వాట్సాప్ ఆర్డరింగ్, అదేవిధంగా వాషబుల్ షూస్ లాంటి వాటితో కస్టమర్లకు చేరువగానే ఉన్నామని సందీప్ తెలిపారు. కరోనా మహమ్మారి తమకు కొత్త అంశాలను నేర్పిందని చెప్పారు. ముఖ్యంగా బాటా బ్రాండ్‌కు టైర్2, టైర్3 మార్కెట్లలో మెరుగైన డిమాండ్ ఉంది. యాభై వేల నుంచి 3 లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో కస్టమర్ల నుంచి డిమాండ్ పెరిగిందని, అలాంటి చోట్ల అదనపు స్టోర్లను తెరవాలని భావిస్తున్నామని సందీప్ కటారియా చెప్పారు.