వ్యాక్సిన్‌పై వయో నిబంధనలు తొలగించాలి

by Shamantha N |   ( Updated:2021-04-11 01:31:01.0  )
వ్యాక్సిన్‌పై వయో నిబంధనలు తొలగించాలి
X

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్‌పై ఉన్న వయో నిబంధనను తొలగించాలని కేంద్రాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. వయస్సుతో సంబంధం లేకుండా అందరికి వ్యాక్సినేషన్‌ను నిర్వహించాలని ఆయన అభ్యర్థించారు. ఢిల్లీలో కరోనా పేషంట్లో 65 శాతం మంది 45 ఏండ్ల లోపు వారు ఉన్నట్టు తెలిపారు. అందుకే కరోనా వైరస్ చైన్‌ను బ్రేక్ చేసేందుకు 45 ఏండ్ల లోపు వారికి కూడా వ్యాక్సినేషన్ చేయాలని కోరారు. అవసరమైతే డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు చెప్పారు. కరోనా కట్టడికి పూర్తి స్థాయి లాక్ డౌన్ అనేది పరిష్కార మార్గం కాదని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed