పీకే డైరెక్టర్‌తో రణ్‌బీర్.. ఆ సినిమాకు సీక్వెల్?

by Jakkula Samataha |
పీకే డైరెక్టర్‌తో రణ్‌బీర్.. ఆ సినిమాకు సీక్వెల్?
X

దిశ, సినిమా : బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ప్రతీ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అందుకే ఆయన సినిమాలకు బాలీవుడ్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో హిరానీ డైరెక్షన్‌లో ఒక్క సినిమా అయినా చేయాలని బీటౌన్ స్టార్ హీరోలు సైతం తాపత్రయ పడతుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. తన నెక్స్ట్ మూవీ రణ్‌బీర్ కపూర్‌తో చేయనున్నట్లుగా తెలుస్తోంది.

గతంలో రాజుహిరానీ-రణ్‌బీర్ కాంబోలో వచ్చిన ‘సంజు’ సూపర్ సక్సెస్ కాగా, ఈసారి రణ్‌బీర్‌తో ‘పీకే’ సీక్వెల్ చేయనున్నట్లు బీటౌన్ వర్గాల టాక్. పైగా అమీర్ ఖాన్ ‘పీకే’ సినిమాలో రణ్‌బీర్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీక్వెల్‌కు చాన్సెస్ ఉన్నాయనేది పరిశీలకుల అంచనా. అయితే హిరానీ మాత్రం ‘సంజు’ చిత్రీకరణ సమయంలోనే రణ్‌బీర్‌కు యూనిక్ థాట్ ఒకటి చెప్పాడని, దాన్ని డెవలప్ చేసి సోషల్ కామెడీ డ్రామాగా తెరకెక్కిస్తారని డైరెక్టర్ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రాజెక్ట్ షారుఖ్ సినిమా తర్వాతే పట్టాలెక్కనుండగా.. ఈలోపు రణ్‌బీర్ కూడా పెండింగ్ సినిమాలు పూర్తి చేయనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story