తాటిచెట్టు కొన నరికితే.. ‘స్ప్రింగ్ లా’ మారింది!

by  |
తాటిచెట్టు కొన నరికితే.. ‘స్ప్రింగ్ లా’ మారింది!
X

దిశ, వెబ్‌డెస్క్ : తాటిచెట్టు అంటే తెలియనివారు ఉండరు. ఒకేచోట, పరిమిత స్థలంలో నిట్టనిలువుగా పెరుగుతూ పోతుంది. అయితే, ఇప్పుడు మనం చూడబోయే తాటిచెట్టు మాత్రం ఒక నిర్ణీత ఎత్తుకు ఎదిగాక వంగిపోయింది. అది అలానే పడిపోతే ప్రమాదం అని భావించిన ఒకరు ఆ చెట్టుకు అంచుకు చేరుకుని కోత మిషిన్ సాయంతో కట్ చేశాడు. ఇక్కడే వింత ఘటన చోటుచేసుకుంది. చెట్టు టాప్‌లో కట్ చేసిన అనంతరం పై భాగం కిందకు పడిపోగా, మిగతా భాగం ‘స్ప్రింగ్ లా’ అటు ఇటు ఊగడం ప్రారంభించింది.

చెట్టుపై ఉన్నవ్యక్తి కూడా దానితో పాటు ఊగసాగాడు. నిజంగా ఆ విజువల్ చూసిన వారు ‘వామ్మో’ అనక మానరు. స్ప్రింగులా ఊగుతున్న చెట్టుపై నుంచి సదరు వ్యక్తి పడిపోతాడేమోనని కింద నుంచి చూస్తున్న వారు కాసేపు ఊపిరిబిగబట్టారంటే అతిశయోక్తి కాదు. చెట్టును నరుకుతున్నప్పుడు అతడు దానిపైనే కూర్చోవడం గమనార్హం. అతడు కింద పడ్డాడా లేదా అనేది తెలిసి రాలేదు. కానీ, దరిదాపుల్లో ఉన్న వాళ్లు మాత్రం ఓ మై గాడ్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం, నవ్వడం, ఆందోళనకు గురవ్వడాన్ని చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే 6.2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. వీడియోను చూసిన నెటిజన్లు వావ్, నమ్మలేకుండా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

https://twitter.com/i/status/1309287499194404866


Next Story