శ్రీలంక జట్టులో కరోనా కలకలం

by Shyam |
srilanka team
X

దిశ, స్పోర్ట్స్: భారత జట్టుతో వన్డే సిరీస్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుండగా శ్రీలంక జట్టులో కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి కరోనా బారిన పడిన జట్టు ఇప్పుడే కోలుకుంటున్నది. అయితే పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ కరోనా బారిన పడినట్లు వెల్లడైంది. ఇక తాజాగా శ్రీలంక జట్టు డేటా అనలిస్ట్ జీటీ నిరోశన్ కూడా కరోనా బారిన పడినట్లు తెలుస్తున్నది.

అయితే ఆటగాళ్లు, ఇతర సిబ్బంది మాత్రం నెగెటివ్‌గా తేలారు. గ్రాంట్ ఫ్లవర్, నిరోశన్‌లను ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో శ్రీలంక కోచ్, అనలిస్ట్ కరోనా బారిన పడటంతో టీమ్ ఇండియాతో జరగాల్సిన సిరీస్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే ప్రస్తుతం నెగెటివ్ వచ్చినా క్వారంటైన్‌లో ఉన్న శ్రీలంక జట్టు నేరుగా మ్యాచ్ ఆడుతుందని.. మ్యాచ్‌కు ముందు అందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తామని శ్రీలంక క్రికెట్ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story