న్యూజిలాండ్‌లో 102 రోజుల తర్వాత తొలి కేసు

by vinod kumar |
న్యూజిలాండ్‌లో 102 రోజుల తర్వాత తొలి కేసు
X

ఆక్లాండ్‌: దాదాపు 102 రోజుల తర్వాత న్యూజిలాండ్‌లో మళ్లీ తొలి కేసు నమోదైంది. దీంతో దేశంలోని అతిపెద్ద నగరం ఆక్లాండ్‌లో ప్రధాని జెసిండా ఆర్డెర్న్ లాక్‌డౌన్ విధించారు. ఆక్లాండ్‌లోని ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్ తేలిందని వెల్లడించారు. 102 రోజుల తర్వాత తొలిసారిగా మళ్లీ దేశంలో కరోనా కేసు నమోదైందని, మహమ్మారిని తుదముట్టించడానికి అందరూ కృషి చేశారని ప్రధాని తెలిపారు. ఈ పరిణామాలకు ప్రణాళిక వేసుకుని సిద్ధమవుతున్నారని వివరించారు.

కరోనాను పూర్తిగా నిలువరించగలిగిందని న్యూజిలాండ్ ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందింది. సామాజిక వ్యాప్తిని అరికట్టడంపైనా మంగళవారం వరకూ ప్రపంచ ఆరోగ్య సంస్థ న్యూజిలాండ్‌పై ప్రశంసలు కురిపించింది. 2.2 కోట్ల జనాభా గల న్యూజిలాండ్‌లో 22 కరోనా మరణాలే చోటుచేసుకోవడం గమనార్హం. కరోనా కట్టడి అనంతరం దేశంలో ప్రజలు దాదాపు సాధారణ స్థితిని పొందారు. రెండోసారీ కరోనా మళ్లీ రావొచ్చని, జాగ్రత్తల పాటించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కొత్త కేసులు రిపోర్ట్ కావడంతో ఆక్లాండ్‌లో మూడు రోజుల లాక్‌డౌన్, దేశవ్యాప్తంగా మళ్లీ భౌతిక దూరం నిబంధన అమల్లోకి రానుంది.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed