- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టైటానిక్ చూడాలనుకుంటే.. రూ. 93 లక్షలు!
దిశ, వెబ్‌డెస్క్: ‘టైటానిక్’ షిప్ మునిగిపోయి ఆల్రెడీ 108 సంవత్సరాలు గడిచిపోయాయి. కాగా ఇప్పటికీ నీళ్లలోనే ఉండిపోయిన ఆ షిప్‌ను చూడాలనుకునే వారికి ఇప్పుడో అవకాశం లభించింది. రూ. 93 లక్షలు చెల్లిస్తే సముద్రగర్భంలో ఉన్న టైటానిక్‌ను మన కళ్లారా చూసి తరించొచ్చు.
1912 సంవత్సరంలో బ్రిటన్‌లోని సౌతాంప్టన్ నౌకాశ్రయం నుంచి న్యూయార్క్ బయలుదేరిన టైటానిక్.. అనుకోకుండా, ఉత్తర అట్లాంటిక్‌లోని మంచుకొండను ఢీకొట్టి సముద్రంలో మునిగిపోయిన విషయం తెలిసిందే. 1985లో ఆ షిప్‌కు సంబంధించిన అవశేషాలను పరిశోధకులు అట్లాంటిక్ సముద్రంలో కనుగొన్నారు. అయితే అప్పటి నుంచి టైటానిక్ ఓడ అక్కడే ఉండిపోయింది. కాగా సముద్ర గర్భంలోని అవశేషాలు, మునిగిపోయిన ఓడల మీద పరిశోధనలతో పాటు సిటిజన్ సైంటిస్ట్‌లకు ట్రైనింగ్ కూడా అందించే ‘ఓషియన్ గేట్ ఎక్స్‌పెడిషన్స్’ అనే సంస్థ.. టైటానిక్ అవశేషాల మీద పరిశోధన చేయనుంది. ఆ పరిశోధన వివరాలను ఓ డాక్యుమెంట్‌గా తీసి భావితరాలకు అందించనుంది. ఇలాంటి అరుదైన అన్వేషణను వీక్షించాలనుకునే వారితో పాటు పరిశోధకులు, యంగ్ సైంటిస్ట్‌లను ఓషన్ గేట్ ఆహ్వానిస్తోంది. మేలో మొదలైన ఈ మిషన్ మొత్తంగా ఆరు భాగాలుగా సాగనుంది. ప్రతి మిషన్ 10 రోజుల పాటు ఉండనుంది( ఒక్కో రోజు 8-10 గంటల పాటు). ఇందులో భాగంగా ఐదుగురు క్రూ మెంబర్స్‌తో పాటు యంగ్ సైంటిస్ట్‌లను సైట్ వరకు తీసుకెళ్తారు. 2022 సమ్మర్‌లోనూ ఈ మిషన్ సాగనుంది. అయితే టైటానిక్ శిథిలాలను చూడాలనుకుంటే మాత్రం.. ఒక్కరికి 1.25 లక్షల డాలర్లు (రూ. 93 లక్షల 15 వేలు) ఖర్చు అవుతుంది. సముద్ర ఉపరితలం నుంచి సుమారు 12,467 అడుగుల లోతుకు ప్రయాణించిన తర్వాత టైటానిక్ అవశేషాల గురించి వివరిస్తారు.
టైటానిక్ శిథిలాలను చూసేందుకు రూ. 93 లక్షలు చెల్లించడం కాస్త ఎక్కువే కానీ, ఆ ఎక్స్‌పీరియన్స్ లైఫ్ టైమ్ ఉంటుంది. టైటానిక్ షిప్ మీద చేరిన బ్యాక్టీరియా వల్ల మరికొన్ని సంవత్సరాల్లో ఆ ఓడ పూర్తిగా ధ్వంసమైపోయే అవకాశముంది. అందుకే దాన్ని డాక్యుమెంట్‌గా రూపొందిస్తే, రాబోయే తరాలకు అందించనట్లుంటుందని ఓషియన్ గేట్ భావిస్తోంది.
ఇక టైటానిక్ ప్రమాద సంఘటన ఆధారంగా ప్రఖ్యాత హాలీవుడ్ దర్శక, నిర్మాత జేమ్స్ కామెరాన్ ‘టైటానిక్’ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే.