ఆ 132మంది ఎమ్మెల్యేల్లో 86 మంది క్రిమినల్స్, 57మంది కోటీశ్వరులు

by Anukaran |   ( Updated:2021-03-05 07:23:33.0  )
ఆ 132మంది ఎమ్మెల్యేల్లో 86 మంది క్రిమినల్స్, 57మంది కోటీశ్వరులు
X

దిశ,వెబ్‌డెస్క్: మరికొద్దిరోజుల్లో జరిగే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 86 మంది ఎమ్మెల్యేలు క్రిమినల్స్ అని తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో అభ్యర్ధులు దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ రిపోర్ట్ తయారు చేసింది. ఆ రిపోర్ట్ లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్ 6న కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార పార్టీ సీపీఎం (లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్), కాంగ్రెస్, బీజేపీతో పాటూ ఇతర పార్టీల నేతలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు.

ఇక ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం 132మంది సిట్టింగ్ స్థానాల అభ్యర్ధుల్లో 86 మంది అభ్యర్ధులపై క్రిమినల్ కేసులు, 28మందిపై సీరియస్ క్రిమినల్ కేసులు, ఇద్దరు ఎమ్మెల్యేలపై మర్డర్ కేసులు, ఆరుగురు ఎమ్మెల్యేలపై మర్డర్ అటెంప్ట్ కేసులు, ఒక ఎమ్మెల్యేపై మహిళను హత్య చేసేందుకు ప్రయత్నించినందకు గాను క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

ఏఏ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యే క్రిమినల్స్ ఉన్నారంటే

పర్సెంటేజ్‌ల రూపంలో వారీగా చూసుకుంటే సీపీఐఎం పార్టీ తరుపున 56 మంది ఎమ్మెల్యేలలో 51 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు, సీపీఐ పార్టీ తరుపున ఉన్న 19మంది ఎమ్మెల్యేలలో 12మందిపై, కాంగ్రెస్ లో ఉన్న 20మంది ఎమ్మెల్యేలలో 9మందిపై , ఐయూఎంఎల్ (ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ ) పార్టీలో ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలపై నలుగురు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయి.

ఏ పార్టీలో ఎంతమంది కోటీశ్వరులు

కేరళ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఏ స్థాయిలో క్రిమినల్స్ ఉన్నారో అదే స్థాయిలో కోటీశ్వరులు ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్ట్ లో తేలింది. కేరళలో ఉన్న 132మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 57మంది కోటీశ్వరులున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీల పరంగా ఏ పార్టీలో ఎంతమంది కోటీశ్వరులున్నారంటే…సీపీఐఎం పార్టీలో ఉన్న 56మంది ఎమ్మెల్యేలలో 15మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరుల జాబితాలో ఉండగా.., ఐయూఎంఎల్ పార్టీలో ఉన్న 18మంది ఎమ్మెల్యేలలో 14మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ లో ఉన్న 20మంది ఎమ్మెల్యేలలో 12మంది ఎమ్మెల్యేలు, కేరళకాంగ్రెస్ లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు, 6మంది ఇండిపెండెంట్ అభ్యర్ధుల్లో 3 కోటీశ్వరులని తేలింది.

కాగా దేశంలో అత్యంత అక్షరాస్యత శాతాన్ని నమోదు చేసుకుంటున్న కేరళ రాష్ట్రంలో 65శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ పలువురు మాత్రం అక్షరాస్యతకు, క్రిమనల్ కేసులకు సంబంధం లేదని కొట్టిపారేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed