- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అదోని పరువు హత్య కేసులో ఇద్దరి అరెస్టు

X
దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లా అదోని పరువు హత్య కేసులో ఇద్దరు నిందితులను టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు ఆడమ్ స్మిత్ భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు ఆమె తండ్రి చిన్న ఈరన్న, పెద్దనాన్న పెద్ద ఈరన్నను అరెస్టు చేశామన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు.
కాగా, తమ కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంతో డ్యూటీ ముగించుకుని బైకుపై ఇంటికి వెళ్తున్న ఆడమ్ స్మిత్‌ను అమ్మాయి పెద్దనాన్న, తండ్రి బండరాయితో మోది దారుణంగా హతమార్చారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా శుక్రవారం నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story