అంబేద్కర్​ వర్సీటీలో అడ్మిషన్లు షురూ

దిశ, న్యూస్​బ్యూరో: డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ, సర్టిఫికెట్​ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయినట్టు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఆయా కోర్సుల్లో చేరడానికి ఫీజులు, కోర్సుల వివరాల కోసం www.braoonline.in లేదా www.braou.ac.in సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు. గతంలో ఫీజులు చెల్లించలేకపోయిన విద్యార్థులు జూలై 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించాలని సూచించారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో సెకండియర్​, థర్డ్​ ఇయర్​ విద్యార్థులు కూడా జూలై 31 లోపు ట్యూషన్​ ఫీజులను ఆన్​లైన్ లో చెల్లించొచ్చని వివరించారు. ఇతర సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో గానీ లేదా విశ్వవిద్యాలయ హెల్ప్​ డెక్స్​ నెంబర్లు 7382929570/580/590/600లలో సంప్రదించాలన్నారు.

Advertisement