కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన అదితి.. మార్పు కనిపిస్తుందా?

by Shyam |
Aditi Rao
X

దిశ, సినిమా: హీరోయిన్ అదితి రావు కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకే రకమైన క్యారెక్టర్స్ చేస్తుందనే ముద్రపడింది. అవకాశాలైతే వస్తున్నాయి కానీ.. అదే రెగ్యులర్ జోన్‌లో వెళ్తుందనే కామెంట్స్ ఇప్పటికీ వినిపిస్తున్నాయి. అయితే ఈ మార్క్ నుంచి బయటపడేందుకు కొత్తగా ట్రై చేశానంటోంది అదితి. నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ‘అజీబ్ దాస్తా్న్స్’ ద్వారా తనలో మరోకోణాన్ని చూపించబోతున్నానని తెలిపింది. నీరజ్ గైవాన్ డైరెక్ట్ చేసిన ‘గీలీ పుచి’ స్టోరీలో కనిపించనున్న అదితి.. ఇద్దరు మహిళల మధ్య అసాధారణమైన స్నేహం, లోతుగా పాతుకుపోయిన సామాజిక సమస్యలను హైలెట్ చేయనుందని వివరించింది. ఈ స్టోరీలో లెస్బియన్‌గా కనిపించనున్న అదితి.. ఒక దర్శకుడు ఆఫర్ ఇచ్చాడని కాకుండా, ఈ క్యారెక్టర్‌ను సవాల్‌గా తీసుకుని నటించానని చెప్పింది. తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నటించగలనా? లేదా అని పరీక్షించుకున్నానని చెప్పింది.

డైరెక్టర్ నీరజ్‌‌తో వర్క్ చేయడం బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్ అన్న అదితి.. రిలేషన్‌షిప్స్‌లోని డైనమిక్స్‌ను ఎక్స్‌ప్లోర్ చేసే క్రమంలో ఫ్రెష్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్‌తో వస్తున్న ‘అజీబ్ దాస్తాన్స్’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపింది. నాలుగు అసాధారణమైన కథలతో వస్తున్న ఆంథాలజీ.. అసూయ, పక్షపాతం, విషపూరిత స్వభావం వల్ల జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల గురించి వివరిస్తుందని వెల్లడించింది.

Advertisement

Next Story