కొండపల్లి బొమ్మ స్టైల్‌లో ‘అదితి’ ప్రమోషన్

by  |
కొండపల్లి బొమ్మ స్టైల్‌లో ‘అదితి’ ప్రమోషన్
X

దిశ, వెబ్‌డెస్క్ : అందాల రాకుమారి అదితి రావు హైదరి సినిమాలు.. ఓటీటీలో ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్యే మలయాళీ మూవీ ‘సోఫియుం సుజాతయుం’తో హిట్ అందుకున్న భామ.. మరో సినిమాతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఎంటర్‌టైన్ చేయబోతుంది. నేచురల్ స్టార్ నాని, హీరో సుధీర్ బాబు, నివేదా థామస్‌తో కలిసి అదితి నటించిన ‘వి’ చిత్రం సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీ కాగా.. తను కూడా ఇందుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.

https://twitter.com/aditiraohydari/status/1300307974179618816?s=19

కొండపల్లి బొమ్మ వెనుక నిల్చున్న అదితి.. అచ్చం అదే బొమ్మ స్టైల్‌లో తలాడిస్తూ, చాలా క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌తో ‘వి’ విడుదలకు ఇంకా ఐదు రోజులే ఉన్నాయని చెప్పింది. అయితే దీనిపై స్పందించిన అదితి ఫ్యాన్స్.. ‘వి’ ట్రైలర్‌లో మీరు కనిపించకపోవడంతో డిసప్పాయింట్ అయ్యామని చెబుతుండగా.. కనీసం సినిమాలో అయినా మీ క్యారెక్టర్ బాగుండాలని అనుకుంటున్నట్లు వెల్లడిస్తున్నారు. మరికొందరేమో నాని ట్రైలర్‌లో చెప్పినట్లు ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గకుండా ఉంటుందనే అంటున్నారు. ట్రైలర్‌లో అదితిని చూపించలేదంటే.. తన క్యారెక్టర్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.

కాగా, ఈ సినిమాలో నాని సైకోగా విలనిజం ప్రదర్శించనుండగా.. సుధీర్ బాబు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. నివేదా క్రైమ్ నావెల్ రైటర్‌గా నటిస్తుండగా.. అదితి పాత్ర గురించి ఇంకా డిటైల్స్ బయటకు రాలేదు.


Next Story

Most Viewed