మీ ప్రేమకు థాంక్స్ : అదితి

by  |
మీ ప్రేమకు థాంక్స్ : అదితి
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ మూవీ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. శనివారం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవుతున్న సినిమా ప్రమోషన్స్ మామూలుగా లేవు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రేక్షకులకు థాంక్స్ చెప్తూ నోట్ పెట్టింది హీరోయిన్ అదితి రావు హైదరీ. ‘వి’ ట్రైలర్‌లో అదితి కనిపించకపోవడంపై అభిమానులు చాలా ఫీల్ అయ్యారు. అదితి ఇక్కడ లేదు.. మరి ఎక్కడ ఉంది?.. కాస్ట్‌లో ఉన్న అదితి ట్రైలర్‌లో లేదంటే.. పక్కా నానికి ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్లే… లాంటి మీమ్స్ నెట్టింట్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.

https://www.instagram.com/p/CEok52BnUrH/?igshid=6r91h3vp2ce6

దీనిపై స్పందించిన అదితి..మీ ప్రేమ, ఇలాంటి మీమ్స్ ఇంకా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. వి ట్రైలర్‌లో తను కనిపించకపోవడం అనేది మూవీ యూనిట్ నిర్ణయం అని..నా చాయిస్ కూడా అదే అని చెప్పింది. కొన్ని సార్లు ఇలా చేస్తే ఆడియన్స్ థ్రిల్‌గా ఫీల్ అవుతారని..సినిమాకు ప్లస్ అవుతుందని అభిప్రాయపడింది. మూవీ చూశాక మీరు కూడా దీనిని సమర్థిస్తారని అంది అదితి. ఇక సినిమాలో మీట్ అవుదామని.. ఇందుకోసం ఓపికగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.


Next Story