నెగెటివ్ రోల్‌‌లో ‘అదితి’

by  |
నెగెటివ్ రోల్‌‌లో ‘అదితి’
X

నేచురల్ స్టార్ నాని నటించిన ‘వి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్‌లో విడుదల కావాల్సిన సినిమా కరోనా కారణంగా వాయిదా పడటంతో ఇక ఓటీటీలోనే రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే ‘వి’తో పాటు ‘టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్’ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టాడు నాని. టక్ జగదీష్ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ కాగా.. శ్యామ్ సింగరాయ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవిని ఇప్పటికే ఫైనల్ చేయగా.. బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరి మరో ముఖ్యపాత్రలో కనిపించనుందని టాక్. ఈ చిత్రంలో అదితి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులు సాధారణం కాగానే సినిమా సెట్స్ పైకి వెళ్తుందని.. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉండనుందని టాక్.

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.


Next Story

Most Viewed