‘ఆదిపురుష్’.. నేచురల్ లుకింగ్ ఫారెస్ట్ కోసం స్పెషల్ టీమ్

by Shyam |
Adhipurush
X

దిశ, సినిమా : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌‌ ‘ఆదిపురుష్’. రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ 3D మైథలాజికల్ ఫిల్మ్.. వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మెయిన్ కాస్ట్‌పై సన్నివేశాలను చిత్రీకరించేందుకు మూవీ యూనిట్ ఓ ఫారెస్ట్ సెట్‌ను డిజైన్ చేయగా, ఇది మరింత సహజంగా కనిపించేందుకు మేకర్స్ చర్యలు తీసుకుంటున్నారని టాక్. ఫుటేజ్ హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్‌గా ఉండేందుకు డెడికేటెడ్ మోషన్ క్యాప్చర్ టీమ్ ఇందుకోసం పనిచేస్తోందని సమాచారం. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రియల్ ఫారెస్ట్‌లో షూటింగ్‌కు అనుమతులు ఇవ్వడం లేదు కాబట్టి సెట్‌లోనే మెయిన్ కాస్ట్‌పై సీన్స్ ప్లాన్ చేశారట.

కాగా ‘ఆదిపురుష్’ టీమ్ తొలిసారిగా ఇండియన్ సినిమాలో ఉపయోగించని న్యూ టెక్నాలజీని ఉపయోగిస్తుండటం విశేషం. రియల్ టైమ్ టెక్నాలజీతో వీఎఫ్‌ఎక్స్ కంబైన్ చేసే కొత్త విధానాన్ని ఈ సినిమా కోసం యూజ్ చేయబోతోంది.

Advertisement

Next Story