కరోనాతో జెడ్పీ వైస్ చైర్మన్ మృతి..

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : కరోనా బారిన పడి ఆదిలాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్ అరె రాజన్న సోమవారం ఉదయం మృతి చెందారు. ఇటీవల ఆయన కరోనా లక్షణాలతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. 10 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి ఇవాళ ఉదయం కన్నుమూశాడు. ఆయన మృతితో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

అయితే, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ చైర్మన్ ప్రేమేందర్ బోథ్, మండల అధ్యక్షుడు తుల శ్రీనివాస్ తదితరులు రాజన్న మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రత్యేక ఏర్పాట్ల నడుమ తీసుకువస్తున్నారు. రాజన్న గతంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆయన మృతితో జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. ఇదిలాఉండగా, రాజన్న మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రేఖా నాయక్, రాథోడ్ బాపురావు, పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు, ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ జనార్ధన్ తదితరులు సంతాపం ప్రకటించారు.

Advertisement