- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరకాల ఎమ్మెల్యేపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
దిశ, క్రైమ్ బ్యూరో: టీఆర్ఎస్ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రిజర్వేషన్ కులాలపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హీటెక్కిస్తున్నాయి. హన్మకొండలో ఆదివారం జరిగిన ఓసీల మహాగర్జన సభలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ… రిజర్వేషన్ కులాల నుంచి ఉద్యోగాలు చేస్తున్న వారికి ఒక్క అక్షర ముక్క కూడా రాదంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలతో కూడిన పలు పత్రికల కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీనిపై… రాష్ట్ర సాంఘీక, గిరిజన సంక్షేమ గురుకులాల కార్యదర్శి, అడిషనల్ డీజీపీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డికి కౌంటర్‌గా చేసిన ట్వీట్ చేశారు.
‘‘అట్లనా.. మరి రాజ్యాంగాన్ని రాసిందెవరు భయ్.. నిన్ను ఎన్నో అనాలనుంది.. కానీ, నియంత్రించుకుంటున్నా.. ఎందుకుంటే నేను చదువుకున్నోన్ని.. కొన్నోన్ని కాదు.. చదువును అమ్ముకునేటోన్ని అంతకన్నా కాదు. నువ్వెంత విషంతో కుళ్లుకుచచ్చినా మేం అక్షరాలతోనే ఆకాశం అంచులను అందుకుంటాం’’ అంటూ తన ట్వీట్ చేశారు. అయితే, ఇంత ఘాటుగా కౌంటర్ వేసిన వ్యక్తి రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కావడం, అడిషనల్ డీజీపీ ర్యాంకులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దీంతో ప్రవీణ్ కుమార్ అభిమానులు వాట్సాప్, పేస్ బుక్, ఇతర సోషల్ మీడియాల్లో ఈ పోస్టును వైర్ చేస్తున్నారు.