- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీచర్ల టైమింగ్ పై అడిషనల్ కలెక్టర్ ఆగ్రహం.. 8 మందికి షోకాజ్ నోటీసులు
దిశప్రతినిధి, మహబూబ్ నగర్ : జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమయ పాలన పాటించకపోవడం పట్ల అదనపు కలెక్టర్ శ్రీ హర్ష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మల్దకల్ మండలంలోని అమరావతి, మల్దకల్, మద్దెలబండ, తాటికుంట గ్రామాలలో ఉన్న పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల ప్రారంభ సమయానికి పలువురు ఉపాధ్యాయులు హాజరుకాకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన నిజామాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
మల్దకల్ ప్రాథమిక పాఠశాలలో ఒకరికి, మద్దెలబండ ప్రాథమిక పాఠశాలల్లో ముగ్గురికి, ఉన్నత పాఠశాలలో నలుగురికి ఇలా మొత్తం ఎనిమిది మంది ఉపాధ్యాయులకు అదనపు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఒకే రోజు ఎనిమిది మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై జోగులాంబ గద్వాల జిల్లా డీఈఓ ను వివరణ కోరగా ఎనిమిది మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం నిజమేనని ధృవీకరించారు.