- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆస్పత్రిలో పామును చూసిన షాకైన అదనపు కలెక్టర్..

దిశ, తుంగతుర్తి : సూర్యాపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో పాము సంచరించడం కలకలం రేపింది. అది కూడా సరిగ్గా తనిఖీ కోసం వచ్చిన జిల్లా అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీ) పాటిల్ హేమంత కేశవ్‌కు కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రిని గురువారం అడిషనల్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
వివిధ గదులను, రికార్డులను తనిఖీ చేసి ప్రసూతి వార్డులోకి వెళ్తుండగా అప్పటికే ఆస్పత్రిలో సంచరిస్తున్న పామును చంపి దానిని బయట పడవేయడానికి వెళుతున్న సిబ్బంది ఒకరు ఆయన కంటపడ్డారు. దీంతో ఒకింత ఆశ్చర్యానికి గురైన అదనపు కలెక్టర్ మిగతా గదులను కూడా సందర్శించారు. తొలిసారిగా తనిఖీకి వచ్చిన అదనపు కలెక్టర్‌కు ఆసుపత్రి అభివృద్ధిని వివరిద్దామనుకుంటే ఇలా జరిగిందేమి టబ్బా..! అనుకుంటూ సిబ్బంది కొంత విచారం వ్యక్తం చేశారు.