షాకింగ్: హాస్పిటల్ లో అడవి శేష్.. పరిస్థితి విషమం!

by Anukaran |   ( Updated:2021-09-20 04:49:02.0  )
షాకింగ్: హాస్పిటల్ లో అడవి శేష్.. పరిస్థితి విషమం!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత రెండురోజులుగా అస్వస్థతకు గురైన ఆయనకు డెంగ్యూ లక్షణాలు కనిపించడంతో హైదారబాద్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జాయిన్ అయ్యినట్లు సమాచారం. పరీక్షల అనంతరం డెంగ్యూ సోకినట్లు వైద్యులు గుర్తించినట్లు తెలుస్తోంది. శేష్ రక్తంలో ప్లేట్ లెట్స్ పడిపోయాయని, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అతను ఆరోగ్య పరిస్థితిపై వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తుంది. ఇందుకు సంబంధించిన ఏదైనా వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శేష్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా కోరుకొంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం శేష్ ‘గూఢచారి 2’, ‘మేజర్’ చిత్రాలలో నటిస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed