- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పల్లె ప్రగతి పనులలో ఆదర్శ అందరికీ ఆదర్శం : కలెక్టర్ కృష్ణ ఆదిత్య
దిశ, ములుగు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనుల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి పనులు అద్భుతంగా పూర్తి చేసి, జిల్లాలో అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి అందరికి ఆదర్శంగా నిలిచారని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో బదిలీపై ఖమ్మం జిల్లా మున్సిపల్ కమిషనర్ గా వెళుతున్న జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ సురభికి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదర్శ సురభి ఉద్యోగులతో కలిసి జిల్లా అభివృద్ధిలో మమేకమై పనులు నిర్వహించారని, ఇదే స్పూర్తి తో మున్ముందు పని చేయాలన్నారు.
ఈ సందర్భంగా బదిలీ పై వెళ్తున్న అదనపు కలెక్టర్ ఆదర్శ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే విధంగా జిల్లా కలెక్టర్ వారు ఏది చెప్తే అది చేయుటకు ఉత్సాహంగా ముందుండి పనులు చేసామన్నారు. జిల్లా అధికారులతో కలిసి పనిచేయడం, వారు సహకరించిన తీరుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలువురు ఉన్నతాధికారులు అదనపు కలెక్టర్ అదర్శ జిల్లాలో చేసిన పలు పనులపై కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడి రవి, జడ్పీసీఈవో ప్రసూనా రాణి , కలెక్టరేట్ ఎఓ శ్యాం, రెవెన్యూ అధికారులు, జిల్లా అధికారులు, పంచాయతీ సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు.