దాని నిర్మాణానికి పోటీ పడుతున్న మూడు కంపెనీలు

by Harish |   ( Updated:2021-08-27 05:01:37.0  )
దాని నిర్మాణానికి పోటీ పడుతున్న మూడు కంపెనీలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పీఎస్ఎల్‌వీ లాంచ్ వెహికల్ నిర్మాణానికి సంబంధించి మూడు సంస్థలు పోటీ పడుతున్నాయి. వాటిలో అదానీ గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం, ఎల్అండ్‌టీ నేతృత్వంలోని కన్సార్టియం, మరొక కంపెనీ ఈ కాంట్రాక్టును పొందడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇస్రో కాకుండా బయటి సంస్థలు లాంచ్ వెహికల్‌ను నిర్మిస్తుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం. 2021 చివరి నాటికి కంపెనీలకు ఈ ఒప్పందాన్ని ఖరారు చేయనున్నారు. ఎంపిక చేసిన సంస్థ లైసెన్స్ దక్కించుకోనుంది.

స్పేస్ డిపార్ట్‌మెంట్(డీఓఎస్) కింద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్), ఆర్ఎఫ్‌పీ(రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్) జారీ చేసిన తర్వాత జూలై 30న మూడు సంస్థలు బిడ్లను దాఖలు చేశాయి. ఎన్ఎస్ఐఎల్ మొదట్లో ఇస్రో వాణిజ్య విభాగంగా మొదలైంది. అనంతరం లాంచ్ వెహికల్స్‌ను ఉత్పత్తి చేయడం, ఉపగ్రహాలను కలిగి ఉండటం సహా ఇతర బాధ్యతలు తీసుకుంది. ఐదు పీఎస్ఎల్‌వీల కోసం సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణను ప్రకటించాయి. ఆర్ఎఫ్‌పీ తర్వాత మూడు కంపెనీలు బిడ్లను సమర్పించాయని సీనియర్ అధికారి చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా కేంద్రం భావిస్తున్న మేక్-ఇన్-ఇండియా లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని ఉపగ్రహాల ప్రయోగానికి ఇస్రో సామర్థ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించబడిందని ప్రభుత్వం తెలిపింది.

Advertisement

Next Story