- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఊపిరితిత్తులను ఇలా కాపాడుకోండి!
దిశ, వెబ్‌డెస్క్ : గత ఆరు నెలల నుంచి ఎక్కడ చూసినా చర్చంతా ‘కరోనా వైరస్’ గురించే. మ్యూటేషన్ కారణంగా.. ఊసరవెల్లిలా ఎప్పటిప్పుడు మారుతున్న ఈ వైరస్.. శాస్త్రవేత్తలకు సైతం సవాల్ విసురుతోంది. కరోనా గురించి రోజుకో కొత్త విషయం తెలియడమే ఇందుకు నిదర్శనం. అయితే కొవిడ్ అనేది.. ‘రెస్పిరేటరీ డిసీజ్’ అని అందరికే తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘లంగ్స్’ను కాపాడుకోవడం, ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం ‘ఆక్యుప్రెషర్’ చికిత్సా విధానంలో ఆశాజనక ఫలితాలు కనిపిస్తుండటం విశేషం.
ఆక్యుప్రెషర్ విధానంలో శరీరంలో శక్తి ప్రవహించే మార్గాల్లోని కొన్ని కేంద్రాలను ఒత్తిడి ద్వారా ఉత్తేజితం చేయొచ్చు. సాధారణంగా మన శరీరంలోని వివిధ అవయవాలతో అనుసంధానమయ్యే మెరీడియన్లు 12 ఉంటాయి. ఈ మెరీడియన్ల నుంచి శక్తి సమంగా ప్రవహిస్తుంటుంది. మనకు ఏదైనా అనారోగ్యం లేదా నొప్పి వచ్చిందంటే ఈ ఎనర్జీ ప్లోలో ఏదో సమస్య ఏర్పడినట్టే. ఈ చికిత్సలో మన సమస్యను బట్టి వాటికి సంబంధించిన పాయింట్లలో ఒత్తిడి కలిగిస్తారు. ఇలా చేయడం వల్ల ‘ఎనర్జీ ఫ్లో’కు ఆటంకం తొలిగిపోయి ఉపశమనం పొందుతాము. ఈ చికిత్సా విధానాన్నే ‘రిఫ్లెక్సాలజీ లేదా ఆక్యుప్రెషర్’ అంటారు. మెడ, మోకాళ్లు, వెన్ను, భుజాలు, గుండె నొప్పులకు చికిత్సతో పాటు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంపొందించడంలోనూ ఈ విధానం ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. వేలాది ఏళ్ల కిందట మన దేశంలోనే పుట్టిన ఈ విధానం.. ప్రస్తుతం ప్రపంచదేశాల్లో ఆదరణ పొందుతుండటం విశేషం.
ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి ముఖ్యంగా మూడు ప్రెషర్ పాయింట్స్ ఉపయోగపడతాయి.
హ్యాండ్స్ :
అరచేయి భూమి వైపు ఉండేలా చేయిని చాచినట్టయితే, మన చూపుడు వేలు, బొటన వేలుకు మధ్యలో ‘వి’ షేప్ కనిపిస్తుంది. సరిగా ఆ రెండు వేళ్ల మధ్యలో ఓ ప్రెషర్ పాయింట్ ఉంటుంది. దానిపై ప్రెషర్ పెట్టడం వల్ల.. ఎనర్జీ ఫ్లో సక్రమంగా అవుతుంది.
అరచేయి :
మన రిస్ట్ భాగానికి.. అరచేయి జాయింట్‌కు మధ్యలో మరో ప్రెషర్ పాయింట్ ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. బొటనవేలుకు కాస్త కింద ఉంటుంది. ఇక్కడ ప్రెషర్ అప్లయ్ చేయడం వల్ల కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచవచ్చు.
కాలర్ బోన్ :
కాలర్ బోన్ కిందున్న హాలో స్పేస్ దగ్గరలో ఓ ప్రెషర్ పాయింట్ ఉంటుంది. అది మొదటి, రెండో రిబ్ మధ్యన ఉంటుంది. ఈ ప్రెషర్ పాయింట్స్ రెండు వైపులా ఉంటాయి. ఈ రెండింటిపై జెంటిల్ ప్రెషర్‌తో నొక్కితే.. శక్తి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రవహిస్తుంది.
ప్రెషర్ ఎలా అప్లయ్ చేయాలి ?
రోజులో రెండు నుంచి మూడు సార్లు.. ఓ రెండు నిముషాల పాటు ఈ పాయింట్స్‌పై జెంటిల్ ప్రెషర్‌ను అప్లయ్ చేయాలి. ఈజీగా చెప్పాలంటే.. ప్రెషర్ పాయింట్స్‌ను చూపుడు వేలుతో ప్రెస్ చేస్తూ.. ఓ నాలుగు లేదా ఐదు బ్రీతింగ్‌ల వరకు ఉంచాలి. ఆ తర్వాత ఫింగర్ టిప్‌ను తీసేయాలి. ఇదే ప్రాసెస్‌ను వరసగా 5 సార్లు చేస్తే సరి.
ఎటువంటి మందుల్లేకుండా నిర్వహించే వైద్యవిధానాలకు ప్రస్తుత కాలంలో డిమాండ్ బాగా పెరిగింది. అందులో ‘ఆక్యుప్రెషర్’ కూడా ఒకటి. నేడు ఎంతోమంది ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్ర లేమి సమస్యలను కూడా ఆక్యుప్రెషర్‌తో పరిష్కరించవచ్చని రిఫ్లెక్సాలజీ నిపుణులు చెబుతున్నారు.