మహేష్ డై హార్డ్ ఫ్యాన్ సూసైడ్

by Shyam |
మహేష్ డై హార్డ్ ఫ్యాన్ సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు డై హార్డ్ ఫ్యాన్, కోలీవుడ్ యాక్ట్రెస్ పద్మజ ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలో తను అద్దెకుంటున్న ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. ఇంటి తలుపులు చాలా రోజులుగా ఓపెన్ చేయకపోవడం, ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు, ఇంటి ఓనర్‌కు సమాచారం అందించారు. డోర్ తెరిచి చూస్తే సీలింగ్ ఫ్యాన్‌కు పద్మజ ఉరేసుకుని కనిపించింది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు.

పద్మజ పవన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే షూటింగ్ నుంచి లేట్ నైట్స్ వస్తుందని భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. తర్వాత పద్మజ భర్త కొడుకుని తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో అప్పటి నుంచి బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఉంటుంది పద్మజ. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. ఇలా ఆత్మహత్య చేసుకుంది. కాగా బాయ్ ఫ్రెండ్ ప్రస్తుతం కనిపించకుండా పోవడంతో అతనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

పద్మజ మృతిపై సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు మహేష్ ఫ్యాన్స్. పద్దు మరణాన్ని తట్టుకోలేకపోతున్నామని… మహేష్ బాబు డై హార్డ్ ఫ్యాన్‌ కుటుంబం నుంచి ఒకరిని కోల్పోవడం బాధిస్తోందంటూ ట్వీట్ చేస్తున్నారు. తన ఆత్మకు శాంతికి కలగాలంటూ #RIPPADDUDHFM హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్‌లో నడిపిస్తున్నారు.

Tags: Mahesh Babu, Padmaja, Suicide, #RIPPADDUDHFM

Advertisement

Next Story