మ్యూజిక్ వీడియోలో మెహరీన్

by  |
మ్యూజిక్ వీడియోలో మెహరీన్
X

పంజాబీ ముద్దుగుమ్మ మెహ‌రీన్ ఫిర్జాదా.. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ త‌ర్వాత ప‌లు తెలుగు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలో పలు విజయాలను సొంతం చేసుకుంది. నాగ‌శౌర్య హీరోగా వ‌చ్చిన ‘అశ్వ‌త్థామ’ చిత్రంలో చివ‌ర‌గా క‌నిపించిన మెహ‌రీన్‌.. ప్ర‌స్తుతం కొవిడ్ ప్ర‌భావంతో కొత్త సినిమాలేవి సెట్స్ పైకి వెళ్ల‌కపోవడంతో ఖాళీగా ఉంది. అయితే, తాజాగా ఓ మ్యూజిక్ వీడియోతో అభిమానుల‌ను అల‌రించేందుకు రెడీ అవుతోంది ఈ భామ.

‘బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా’ అంటూ ప్ర‌పంచ‌దేశాల్లోని మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను అల‌రించాడు బాలీవుడ్ సింగ‌ర్ ఆర్మాన్ మాలిక్‌. ఈ సింగ‌ర్ ‘జ‌ర థెహ్రో’ పేరుతో ఓ మ్యూజిక్ వీడియోను రూపొందించారు. ముంబైలోని మెహ‌రీన్ అపార్ట్‌మెంట్ ప‌రిస‌రాల్లో.. ఆర్మాన్ మాలిక్‌, మెహ‌రీన్‌పై ఈ వీడియోను చిత్రీక‌రించారు. ట్రిగ్గ‌ర్ హ్యాపీ-డ‌బూ మాలిక్ మ్యూజిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ వీడియో.. త్వ‌ర‌లోనే పాపుల‌ర్ యూట్యూబ్ చాన‌ల్‌లో సంద‌డి చేయ‌నుంది.



Next Story