ఇండస్ట్రీలో మరో విషాదం.. రంగస్థల నటుడు ప్రకాశ్ రాజు క‌న్నుమూత‌

by Shyam |   ( Updated:2021-04-25 23:05:57.0  )
Actor Prakash Raj
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న(ఆదివారం) సూర్యాపేట జిల్లా ఫణిగిరికి చెందిన ప్రముఖ కమెడియన్ పొట్టి వీరయ్య మృతిచెందిన విషయం మరువక ముందే మరో నటుడు మృతిచెందాడు. తిరుప‌తి న‌గ‌రానికి చెందిన ప్రముఖ రంగ‌స్థలి న‌టుడు ప్రకాశ్ రాజు(82) క‌న్నుమూశారు. ఐదు ద‌శాబ్దాలుగా నాట‌క రంగానికి ఎన‌లేని సేవ‌లు అందించిన ఆయ‌న అసెంబ్లీ రౌడీ, రాయలసీమ రామన్న చౌదరి చిత్రాల్లో నటించారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న శ‌నివారం రాత్రి క‌న్నుమూశారు. ఆయ‌న మృతికి ప‌లువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అశోక్‌ సామ్రాట్, రాణా ప్రతాప్, పృధ్వీరాజ్, చాణక్య చంద్రగుప్త, విశ్వనాథ నాయకుడు, లేపాక్షి, అక్భర్‌ అంతిమ ఘడియలు వంటి నాట‌ల‌కాల‌తో ప్రకాశ్ రాజు మంచి పేరు తెచ్చుకున్నారు.

Advertisement

Next Story