- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇది యుద్ధం కాదు.. బండ్ల గణేష్‌కు ప్రకాశ్ రాజ్ కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రకాశ్ రాజ్‌కు మద్దతు ఇస్తూ.. ఆయన ప్యానల్‌లో సభ్యుడుగా ఉన్న నిర్మాత బండ్ల గణేశ్ ఇటీవల యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ప్రకాశ్ రాజ్ ఈ ఆదివారం ‘మా’ సభ్యులందరినీ విందుకు ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ పంపారు. దీంతో బండ్ల గణేశ్ ప్రకాశ్ రాజ్‌కు కౌంటర్ ఇచ్చాడు. ‘దయచేసి ‘మా’ కళాకారులను విందులు, సన్మానాల పేర్లతో ఒక దగ్గరకు చేర్చొద్దు.. ఎందుకంటే గత రెండేళ్లలో అందరూ కరోనా భయంతో బతుకుతున్నారు. చాటా మంది చావు దాకా వెళ్లొచ్చారు. అందులో నేనూ ఒకడిని. ఓటు కావాలంటే ఫోన్ చేసి, మీరు ఏం అభివృద్ధి పనులు చేస్తారో చెప్పండి. అంతేకానీ ఇలా విందుల పేరుతో ఒక చోట చేర్చి కళాకారుల ప్రాణాలతో చెలగాటమడొద్దని నా మనవి’ అంటూ ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు.
దీనిపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. ‘‘బండ్ల గణేష్ మాటలకు షాక్ అయ్యాను. ‘మా’ ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 19న వస్తుంది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ర్యాలీలపై బండ్ల గణేష్ స్పందిస్తే బాగుంటుంది. అసోసియేషన్ ఎన్నికలంటే అందిరితో మాట్లాడాల్సి ఉంటుంది. ఇది యుద్ధం కాదు.. జస్ట్ ఎలక్షన్’’ అని స్పష్టం చేశారు. అనంతరం జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ.. బండ్ల గణేష్ ప్రశ్నలకు ఆన్సర్ చేయటం టైమ్ వేస్ట్ అని కొట్టిపారేశారు. నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. బండ్ల గణేష్‌కు భిన్నాభిప్రాయాలు ఉండటం అతని ఇష్టం అని అన్నారు.