‘అత్యాచారం చేస్తే అప్పుడే ఎందుకు చెప్పలేదు’

by Anukaran |   ( Updated:2020-08-28 11:40:29.0  )
‘అత్యాచారం చేస్తే అప్పుడే ఎందుకు చెప్పలేదు’
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అత్యాచారం కేసు సంచలనంగా మారింది. ఇటీవల తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూ, ఓ యువతి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు ద్వారా వెలుగుచూసిన అత్యాచారం కేసులో.. యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు (విలేజ్ లో వినాయకుడు ఫేం), పలువురు రాజకీయ ప్రముఖుల పేర్లు ఉండటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మరో వైపు తనపై గత పదేండ్లుగా 139 మంది అత్యాచారం చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.

ఈ ఆరోపణల పై స్పందించిన కృష్ణుడు.. యువతి తప్పుడు కేసులు పెట్టిందంటూ ఆరోపించారు. షీ టీమ్స్ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఉన్న ఈ కాలంలో అమ్మాయి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. పది ఏండ్లుగా జరుగుతున్న వ్యవహారానికి ఇప్పుడు ఫిర్యాదు ఎందుకు చేసిందో సమాధానం చెప్పాలన్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులను ఇటువంటి కేసులో ఇరికించి హాట్ టాపిక్‌ చేయాలని చూస్తున్నట్లు చెప్పారు. తన పై చేసిన ఫాల్స్ కేసుతో తన కుటుంబం మొత్తం మానసిక క్షోభకు గురయ్యారని కృష్ణుడు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story