- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభిమానికి బాలయ్య ఫోన్.. నా నడుం కూడా విరిగింది.. ధైర్యంగా ఉండు!
దిశ, వెబ్‌డెస్క్ : హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ తన అభిమానికి ఫోన్ చేసి పరామర్శించారు. చిత్తూరు జిల్లాకు చెందిన మురుగేశ్ అనే వ్యక్తి నందమూరి కుటుంబానికి వీరాభిమాని. ఇటీవల చెట్టు మీద నుంచి కిందపడి మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న నందమూరి బాలయ్య ఆదివారం మురుగేశ్‌కు కాల్ చేసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆదిత్య 369 సినిమా షూటింగ్ సమయంలో తనకు కూడా నడుం విరిగిందని.. అయినా తిరిగి కోలుకున్నానని, ధైర్యంగా ఉండాలని అభిమానికి సూచించాడు నందమూరి నటసింహం. అంతేకాకండా అభిమాని దీనస్థితిని చూసి చలించిపోయిన బాలయ్య రూ.40వేల ఆర్థిక సాయం అందజేశాడు. మురుగేశ్ కుటుంబం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గొల్లపల్లిలో నివాసముంటున్నారు. కాగా, అభిమానులను ఎప్పుడు కసిరించుకుంటున్నాడని పేరున్న బాలయ్య.. ఇలా కష్టాల్లో ఉన్నవారికి సాయం కూడా అందించాడని తెలిసి నందమూరి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.